చెట్ల కొమ్మలు నరకడం ఇక సులువు | - | Sakshi
Sakshi News home page

చెట్ల కొమ్మలు నరకడం ఇక సులువు

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

హన్మకొండ: చెట్ల కొమ్మలు నరకడం ఇక నుంచి సులువు కానుందని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. చెట్ల కొమ్మలు నరకడం కోసం సమకూర్చిన హైడ్రాలిక్‌ బకెట్‌ ల్యాడర్‌ వాహనాన్ని బుధవారం హనుమకొండ బాలసముద్రంలో ప్రారంభించారు. అనంతరం ల్యాడర్‌ ద్వారా కొమ్మల నరికివేతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ లైన్ల పైకి చెట్ల కొమ్మలు విస్తరించి తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. సులువుగా, వేగంగా చెట్ల కొమ్మలు తొలగించేందుకు ఈ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం హనుమకొండ సర్కిల్‌కు సమకూర్చామని, వరుసగా అన్ని సర్కిళ్లకు విస్తరిస్తామన్నారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేలా అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్‌, సీఈలు కె.తిరుమల్‌రావు, రాజుచౌహాన్‌, అశోక్‌, హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్యనాయక్‌, డీఈలు జి.సాంబరెడ్డి, మల్లికార్జున్‌, అనిల్‌కుమార్‌, భాస్కర్‌, ఏడీఈ రాజు, ఏఈ ప్రవీణ్‌, లైన్‌మెన్‌ మల్లికార్జున్‌, సిబ్బంది శౌర్య, సదానందం, వంశీధర్‌, సిద్ధిరెడ్డి, రాంరెడ్డి, వినయ్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ

కర్నాటి వరుణ్‌ రెడ్డి

హైడ్రాలిక్‌ బకెట్‌ ల్యాడర్‌

సేవలకు శ్రీకారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement