రిజిస్ట్రేషన్‌ శాఖలో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖలో బదిలీలు

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

● ఇన్‌చార్జ్‌ డీఐజీగా ప్రవీణ్‌కుమార్‌, నూతన డీఆర్‌గా సుబ్బలక్ష్మి

కాజీపేట అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖలో రెండేళ్లలోపే బదిలీలు షురూ అయ్యాయి. 2024 జూలై 25న అటెండర్‌ నుంచి డీఐజీ స్థాయి వరకు బదిలీ అయ్యారు. 2026 జూన్‌ 30న డీఐజీ, డీఆర్‌ బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. కాగా, ఈసారి పూర్తిస్థాయి జిల్లా రిజిస్ట్రార్‌ వరంగల్‌కు వచ్చారు.

బదిలీల్లో ఇలా..

వరంగల్‌ డీఐజీగా విధులు నిర్వర్తిన్న సుభాషిణి రెండేళ్లలోపే రంగారెడ్డి డీఐజీగా బదిలీ కాగా.. ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఎఫ్‌ఏసీ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ కరీంనగర్‌ జిల్లాకు డీఐజీగా, ఎఫ్‌ఏసీగా వరంగల్‌ జిల్లా డీఐజీగా నియమితులయ్యారు. జిల్లా రిజిస్ట్రార్‌గా 2024లో బదిలీపై వచ్చిన ఫణీందర్‌ ఏడాదిలోపే హైదరాబాద్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. ప్రవీణ్‌కుమార్‌ ఎఫ్‌ఏసీ డీఆర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్‌ జిల్లా రిజిస్ట్రార్‌ వల్లి సుబ్బలక్ష్మి ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీపై వచ్చారు. జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్‌ ఎ.శ్రీనివాస్‌ వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ మార్కెట్‌ వాల్యూ అండ్‌ ఆడిటింగ్‌ విభాగానికి పదోన్నతిపై వచ్చారు.

తర్వాత సబ్‌ రిజిస్ట్రార్లే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చెందిన సబ్‌ రిజిస్ట్రార్లు 2024లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, ఖమ్మం జిల్లా సబ్‌ రిజిస్ట్రార్లు ఉమ్మడి వరంగల్‌కు వచ్చారు. ఏడాదిలోపే 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని 8 మంది తిరిగి డిప్యుటేషన్‌ పేరిట ఖమ్మం జిల్లాకు, కొందరు లాంగ్‌ లీవ్‌ పేరుతో వెళ్లారు. దీంతో 13 సబ్‌ రిజిస్ట్రార్‌కార్యాలయాల్లో ఐదు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సబ్‌ రిజిస్ట్రార్లు, మిగతా వాటిల్లో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ, డీఆర్‌ బదిలీల తర్వాత సబ్‌ రిజిస్ట్రార్లను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీలతోనైనా పూర్తిస్థాయి సబ్‌ రిజిస్ట్రార్లు వచ్చేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement