ఓరుగల్లు మేత్రాసనం అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు మేత్రాసనం అభివృద్ధే లక్ష్యం

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

కాజీపేట రూరల్‌ : ఓరుగల్లు మేత్రాసనం కేంద్రంగా విశ్వాస ఆధ్మాతిక, విద్య, వైద్య, సాంఘింక రంగాల అభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేయనున్నట్లు ఓరుగల్లు మేత్రాసనం నూతన పీఠాధిపతి బిషప్‌ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కాజీపేట ఫాతిమానగర్‌ పాస్ట్రల్‌ సెంటర్‌ గ్రీన్‌హౌజ్‌లో మీడియా ఇన్‌చార్జ్‌ ఫాదర్‌ ఎం.జయపాల్‌ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిషప్‌ విజయపాల్‌రెడ్డి మాట్లాడారు. ఓరుగల్లు మేత్రాసనం పరిధిలోని 12 జిల్లాల్లో కులమతాలు, ప్రాంతాలు, వర్గాలకతీతంగా ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనుల ప్రయోజనాలే ధ్యేయంగా పని చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత ఓరుగల్లు మేత్రాసనం విశిష్టమైందని, రోమ్‌ 14వ లియోపోమ్‌ తనను 4వ పీఠాధిపతిగా నియమించారని చెప్పారు. 1952లో ఓరుగల్లు మేత్రాసనం ఏర్పడిందని, మొదటి బిషప్‌గా అల్పోన్స్‌ బిషప్‌ బెరెట్టా, 2వ బిషప్‌గా తుమ్మబాల, 3వ బిషప్‌గా ఉడుములబాల, 4వ బిషప్‌గా తాను ఈ నెల 3వ తేదీన పట్టాభిషేకంతోపాటు నూతన వరంగల్‌ బిషప్స్‌ హౌజ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు తాటికొండ జోసెఫ్‌, కాసుమర్రెడ్డి, వై.కిరణ్‌, బాలరాజ్‌, బ్రదర్‌ జార్ట్‌, టామీ, మథ్యాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫాతిమామాత ఆశీర్వాదంతో

సకల జనులకు సేవలు

బిషప్‌ విజయపాల్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement