భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

మల్హర్‌(కాటారం) : మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గత నెల 29 తేదీన జరిగిన భార్య హత్య కేసులో భర్తను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిచారు. ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన సత్యంకు రాజమణితో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు రవళి, కుమారుడు మాన్విత్‌ ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతుందని ఆగ్రహంతో సత్యం కత్తితో భార్య మెడపై కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, హత్య చేసిన రోజు ధరించిన దుస్తులను పడేసిందుకు బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారి వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులను చూసి పరిగెడుతుండగా సీఐ నాగార్జునారావు, సిబ్బంది పట్టుకున్నారు. కత్తి, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యంను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా, హత్య కేసును త్వరగా ఛేదించిన సీఐ నాగార్జునారావు, ఎస్సై శ్రీనివాస్‌, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.

వివరాలు వెల్లడించిన

డీఎస్పీ సూర్యనారాయణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement