ఖిలా వరంగల్: మార్కెట్ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యమని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పులి ప్రియాంక అన్నారు. ఈమేరకు బుధవారం మార్కెట్‌లో జరిగిన పాలకవర్గ మొదటి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీటి సౌకర్యం కోసం పైపులైన్, కొత్త వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనాలు, ఆర్‌ఓ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా 4000 లీటర్లకు పెంచడం, రెండు బోర్లు వేయడం, మిర్చియార్డు, పల్లికాయ యార్డు మధ్యన మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం మార్కెట్‌యార్డ్ చుట్టూ కూలిపోయిన గోడ మరమ్మతులు చేయించడం తదితర అభివృద్ధి పనులు చేపట్టడానికి పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్‌పర్సన్ పులి ప్రియాంక తెలిపారు. ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, వైస్ చైర్మన్ బండి జనార్దన్, సభ్యులు గాదరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్లా వాసుదేవారెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహనాయక్, ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్‌కుమార్, కత్తి సంపత్, మహమ్మద్ సబేర, అచ్చ నాగరాజు, దుగ్యాల గోపాల్‌రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, సహాయ సంచాలకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్‌పర్సన్ పులి ప్రియాంక
పాలకవర్గ మొదటి సమావేశంలో పలు
అంశాలపై తీర్మానాలు


