న్యూస్‌రీల్
కమిషనరేట్‌ను వీడని అవినీతి అధికారులు..
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కిడ్స్ ప్లేస్కూల్స్‌ను బుధవారం అధికారులు సీజ్ చేశారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఆదేశాల మేరకు వండర్ కిడ్స్, బచ్‌పన్, కిడ్జి ప్లేస్కూ ల్స్‌ను మూసివేశారు. అదేవిధంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరుతో నిర్వహిస్తున్న మై చోటా ప్లేస్కూల్స్‌ను కూడా సీజ్ చేసినట్లు హనుమకొండ ఎంఈఓ నెహ్రూ తెలిపారు. ఆయా స్కూళ్లలో నోటీసులు అంటించి, తల్లి దండ్రులకు కూడా సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట దర్గా ప్రాంతంలో గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీహ్యాపీ ప్లేస్కూ ల్‌ను సీజ్ చేశామని కాజీపేట ఎంఈఓ బి.మనోజ్‌కుమార్ తెలిపారు. ఈ ప్లేస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంఈఓ వెంట సీఆర్పీలు ప్రవీణ్‌కుమార్, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని గిరిరాజ్‌గౌడ్ తల్లిదండ్రులను కోరారు.
కేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్‌కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు.
నయీంనగర్: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘కుడా’ రెండేళ్ల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్‌ను వారికి అందజేశారు. రెండేళ్ల కాలంలో వరంగల్ మహానగర పరిధిలో మౌలిక వసతుల కల్పన, మాస్టర్ ప్లాన్ విస్తరణ, ల్యాండ్ పూలింగ్, కాళోజీ కళాక్షేత్రం వంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి తదితర అంశాలను చైర్మన్ వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ‘కుడా’ను ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నట్లు ఆ యన తెలిపారు. ఇనగాల వెంట ఎమ్మెల్యే నాగరాజు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, నాయకులు ఉన్నారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు, ప్రముఖ రుగ్వేద పండితుడు సూర్యనారాయణ ఘనాపాఠి, శివసుబ్రహ్మణ్య ఘనాపాఠి సోదరులు రుగ్వేద సుధాకర బిరుదు అందుకున్నారు. ఈ మేరకు శ్రుతి స్మృతి ట్రస్ట్ బాధ్యులు హైదరాబాద్‌లోని స్కందగిరి దేవాలయంలో 33 రోజులుగా రుగ్వేద ఘనపారాయణం నిర్వహించారు. ఆగమ సామ్రాట్ భద్రకాళి శేషు ఈ కార్యక్రమంలో పాల్గొని పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు ప్రదానం చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఘనాపాఠి సోదరులకు రుగ్వేద సుధాకర బిరుదు అందజేశారు.
● శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
● కమిషనరేట్‌లో బాధ్యతల స్వీకరణ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమి షనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్‌బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
అమ్మవారికి
సీపీ శ్వేత పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత తదితరులు ఉన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్‌జోషి, ఏవీ రంగనాథ్, అంబర్‌కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్‌ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి.
పార్కింగ్ సమస్య..
నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఏఆర్‌లో ఎక్కడి వారు అక్కడే..
పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్‌తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్‌ఎస్సై, ఆర్‌ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్‌ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్‌మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి.
నేతల అండ.. నిబంధనలు తూచ్
వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్‌లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్‌మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు.
దృష్టి సారిస్తే...
మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏది ఏమైనా నూతన సీపీ ఆల్ ది బెస్ట్.
వరంగల్ సబ్ డివిజన్‌లో కరువైన లా అండ్ ఆర్డర్..
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజారోగ్య రక్షణలో వైద్యులది కీలక పాత్ర అని హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహత్ బాజ్‌పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్‌క్రాస్ పాలకవర్గ సభ్యులు ప్రముఖ వైద్యుడు, భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి–వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి, హనుమకొండ డీఎంహెచ్‌ఓ ఎస్‌డీ.రాంకుమార్, జిల్లా పాలకవర్గ సభ్యులు, పలువురు వైద్యులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
పెద్దమ్మగడ్డలో కలెక్టర్ పర్యటన
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ ప్రాంతంలో బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పర్యటించారు. స్థానిక సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇరుకై న రహదారి, అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు. మెరుగైన వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. పెద్దమ్మగడ్డలో అద్దె భవనంలో ఉంటున్న యుపీహెచ్‌సీకి సొంత భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మాజీ కార్పొరేటర్ బోడ అనయ్ కలెక్టర్‌ను కోరారు.
పేదల కోసం
భూ పోరాటం ఉధృతం
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
హన్మకొండ అర్బన్: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు సాధించే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే కలెక్టరేట్‌కు చేరుకున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు అధికారులను, సిబ్బందిని లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పికెటింగ్ కొనసాగుతుండగా సుబేదారి పోలీసులు వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వామపక్ష శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం త క్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులను సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కా ర్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, జి.ప్రభాకర్‌రెడ్డి, ఎన్.హంసారెడ్డి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదరను కోరిన ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌డీ రాంకుమార్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. డీఎంహెచ్‌ఓ తీరు అభ్యంతరకంగా ఉందంటూ బుధవారం ఆ శాఖ ఉద్యోగులు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని.. మంత్రి దామోదరకు ఫోన్ చేసి డీఎంహెచ్‌ఓపై వచ్చిన ఫిర్యాదు గురించి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పరస్పర గౌరవం, సానుకూల వాతావరణంలో విధులు నిర్వర్తించే పరిస్థితులు ఉండాలన్నారు. ఎమ్మెల్యే నాయిని వెంట ఎమ్మెల్సీ సారయ్య ఉన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణారావు, కార్యదర్శి డాక్టర్ రాజిరెడ్డి, ఏఓ కోలా రాజేశ్, నెహ్రూ చందు, యాదానాయక్, సుధాకర్, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
చర్చనీయాంశంగా ఫిర్యాదు..
రామన్నపేట: డీఎంహెచ్‌ఓ రాంకుమార్‌పై ఎమ్మె ల్యే, కలెక్టర్‌కు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారంది. మహిళా ఉద్యోగులపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని, చిన్న విషయాలకే తీవ్రస్థాయిలో మందలిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు ఫి ర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ రాంకుమార్‌ను వివరణ కోరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలలో జిల్లా 25 నుంచి 219వ స్థానంలో ఉండడంతో వైద్య సిబ్బంది, అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించాను. కొంతమంది యూ నియన్ నేతలు కార్యాలయాలు వదలకుండా తిష్టవే సి అసత్య ఆరోపణ చేస్తున్నారు. ఏ ఉద్యోగిపై ఎ లాంటి వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నారు.
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. భూగర్భజల మట్టం కూడా గణనీయంగా పడిపోవడం భవిష్యత్‌లో నీటి కొరతకు సంకేతాలిస్తోంది. విస్తారంగా వర్షాలు కురవకపోతే జిల్లాలో ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జూలైలో కురవాల్సిన వర్షం కంటే అధికంగా వాన పడితే జనాల తిప్పలు తప్పనున్నాయి. జిల్లాలోని పర్వతగిరి, సంగెం మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదముంది. నర్సంపేటలో అత్యధికంగా 80 శాతం వర్షపాతం లోటు నమోదైంది. భూగర్భ జలాలు మరింత పడిపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
మరింత దిగువకు భూగర్భజలాలు
హన్మకొండ: వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలు కురవకపోవడం, పెరిగిన జల వినియోగంతో హనుమకొండ జిల్లాలో జలమట్టం తగ్గుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో సగటున మే నెలాఖరులో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ ఏడాది 69 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. ఫలితంగా ప్రతీ నెల భూగర్భజలాలు పడిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తోంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తోంది. హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలం పీచర్లలో అత్యధికంగా 16.3 మీటర్ల లోతున భగర్భజలాలు పడిపోయాయి.
విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు
విజయలక్ష్మిబాయి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, సైట్ డైరెక్టర్ విజయలక్ష్మిబాయి జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓలను ఆదేశించారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ, అర్బన్ మండలాల విద్యాశాధికారులు, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జయశంకర్ బడిబాటలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు, ప్రీప్రైమరీలో విద్యార్థుల నమోదు ఎలా ఉంది, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, హనుమకొండ, కాజీపేట మండలాల పాఠశాలల్లో అల్పాహారం పంపిణీపై ఆరా తీశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల నమోదు 33 వేలకుపైగా నమోదు లక్ష్యంగా ఉందని, ఇప్పటివరకు 28 వేల వరకు అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు. విద్యార్థుల వివరాలను యూడైస్‌లో పేర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10 వరకు వి ద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకునేలా కృషిచేయాలని విజయలక్ష్మిబాయి సూచించారు. ఎంఈఓలు నెహ్రూ, శ్రీనివాస్, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు మ హేశ్, మన్‌మోహన్, సునీత, సుమాదేవి ఉన్నారు.
బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా
వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇన్‌వార్డులో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య మనస్పర్థలు తలెత్తడం, విధుల్లో బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో వారికి విధులను గుర్తు చేసినట్లు అడిషనల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌వార్డులో నమోదైన దరఖాస్తులు ఆయా విభాగాలకు పంపించడంలో జాప్యం అవుతోందని ఇన్‌వార్డు ఉద్యోగులు చందన, శ్రుతిని తన చాంబర్‌కు పిలిపించి దరఖాస్తులను త్వరితగతిన చేరవేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందులతోనే శ్రుతి తన స్వగృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. వాస్తవాలను పక్కన పెట్టిన బల్దియా ఉద్యోగులు, అధికారులపై నింద మోపడం సరికాదన్నారు. ఈ ఘటనలో సీ–1 సూపరింటెండెంట్, ఇతర ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) సెక్రటరీగా జిల్లా కేంద్రంలోని టీపీటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆదిరాజు శైలజ నియమితులయ్యారు. ఈమేరకు డీఈఓ, డీసీఈబీ చైర్మన్ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ బి.రాంధన్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమించిన శైలజ బుధవారం సాయంత్రం డీఈఓ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
ఏఆర్‌లో పాతుకుపోయిన అధికారులు
నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్
వరంగల్ సబ్ డివిజన్‌లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్‌లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్‌మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
సీసీఎస్‌లో కదలరు.. వదలరు
దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్‌ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్‌ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్‌లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి.
పడిపోతున్న భూగర్భజలాలు
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కానరాని వాన
రైతుల ఎదురుచూపు


