ఉపయోగపడే పరిశోధనలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపయోగపడే పరిశోధనలు చేయాలి

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం

కేయూ క్యాంపస్‌: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం అన్నారు. ద్రవిడియన్‌ పొలిటికల్‌ సైన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘అండర్‌ స్టాండింగ్‌ డ్రవిడియన్‌ సొసైటీ అండ్‌ పాలిటిక్స్‌’ అనే పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఏడాది మే 9, 10 తేదీల్లో నిర్వహించిన సదస్సుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను పుస్తకం రూపంలోనికి తీసుకురావడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. కార్యక్రమంలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగం అధిపతి డాక్టర్‌ కృష్ణయ్య, పీవీ నర్సింహారావు నాలెడ్జ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వడ్లకొండ సత్యనారాయణ, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పాలాకుల కొమురయ్య, ద్రవిడ పొలిటికల్‌ సైన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నాగరాజు, ఉపాధ్యక్షుడు సోమలింగం, సహాయ కార్యదర్శి నరేష్‌కుమార్‌, కోశాదికారి డాక్టర్‌ ప్రశాంత్‌, కార్యవర్గసభ్యులు సురేష్‌, లీలావతి, పరిశోధక విద్యార్థిని రుబీనా పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి

రాంనగర్‌లో అడ్డుకున్న పోలీసులు

వినతిపత్రం స్వీకరించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు

హన్మకొండ: తమకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. మంగళవారం హనుమకొండలోని మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ర్యాలీగా హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు కొండా సురేఖ ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. సీఐటీయూ నాయకులు, మున్సిపల్‌ కార్మికులు ర్యాలీగా చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులనుంచి వినతి పత్రం స్వీకరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్‌, సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు బొట్ల చక్రపాణి, ఆర్‌.కోటీశ్వర్‌, బరుపట్ల మహేష్‌, వై.బాబు, మున్నంగి రఘు, ఎర్ర నరేష్‌, కొట్టే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement