ప్రత్యేక సవరణతో ఓటర్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సవరణతో ఓటర్ల తొలగింపు

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

వరంగల్‌ చౌరస్తా: ప్రత్యేక సవరణ పేరుతో అర్హుల ఓటర్లను తొలగిస్తూ పాలకులు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక (టీఎస్‌డీఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయక రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడుకుందాం అనే అంశంపై వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి ఓంకార్‌ భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎన్‌రెడ్డి హంసారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి మాట్లాడుతూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌.. స్పెషల్‌ ఇంటెన్సీ రిమూవ్‌గా మారిందన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోట్లాది ఓట్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాద గోని రవి, న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి జేవి చలపతిరావు, ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జూపల్లి జానకి రాములు, ఆరెల్లి కృష్ణ, ఇనాం ఉమ్మడి జిల్లా బాధ్యులు మహమ్మద్‌ జుబేర్‌ హమ్‌, బోళ్ల రామకృష్ణ, ఎలకంటి రాజేందర్‌ , కన్నం వెంకన్న, రాచర్ల బాలరాజు, సుభాన్‌, మాస్‌ సావిత్రి, వల్లపు ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

టీఎస్‌డీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement