● గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: పారిశుద్ధ్య నిర్వహణలో జవాబుదారీతనం పెరగాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను హెచ్చరించారు. మంగళవారం ఉదయం 34వ డివిజన్ పరిధిలోని శివనగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్థానిక వార్డు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జి సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు.


