ఏమేం తనిఖీ చేస్తారంటే..
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలతో ఈ విద్యాసంవత్సరం 2026–27లోనూ తనిఖీలు చేపట్టనున్నారు. ఈమేరకు ఇటీవల తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై కొనసాగుతుండగా.. తాజాగా అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలను కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. దీంతో డీఈఓలు మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటు కోసం ఉపక్రమించారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో బాధ్యతలను నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ఆసక్తి ఉంటే ఈసారి అవకాశం కల్పించనున్నారు. లేకపోతే మళ్లీ కొత్తవారికి అవకాశం ఇస్తారు. తనిఖీ బృందంలో పనిచేసేవారు విధులకు దూరం అవుతారు.
దరఖాస్తుల స్వీకరణ
హనుమకొండ జిల్లాలో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలకు 39 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా.. డీఈఓలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో పనిచేసినవారు ఆసక్తి ఉంటే.. సంబంధిత ఎంఈఓల నుంచి సిఫార్సుతోకూడిన సమ్మతి పత్రాన్ని డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరం దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులు ఈసారి తమ హెచ్‌ఎంల, ఎంఈఓల ద్వారా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
పాఠశాల విధులకు దూరం..
తనిఖీ బృందాల విధుల్లో పాల్గొననుండడంతో కొందరు స్కూల్ అసిస్టెంట్లు పాఠశాల విధులకు దూరం కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత (ఎస్‌ఏ) ఉండడంతో హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఏర్పడనుంది. ఫలితంగా విద్యాబోధనపై ప్రతికూల ప్రభావం పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ తర్వాతే ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు కూడా చేస్తారు.
457
743
7
9
516
394
6
437
330
ఆసక్తి ఉన్న టీచర్ల కొనసాగింపు
మళ్లీ కొత్తగా దరఖాస్తుల స్వీకరణ
విధులకు దూరమవుతున్న పలువురు ఉపాధ్యాయులు
ఇప్పటికే హైస్కూళ్లలో సబ్జెక్టు
టీచర్ల కొరత!
బృందాల వివరాలు ఇలా..
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధన
విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలివ్వడం.
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల బోధన పరిశీలన.
పాఠశాలల సందర్శన సమయాల్లో గమనించిన అంశాల ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఎజెండాను సిద్ధం చేస్తారు.


