శిక్ష పడుతుందనే భయం కలగాలి | - | Sakshi
Sakshi News home page

శిక్ష పడుతుందనే భయం కలగాలి

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

శిక్ష పడుతుందనే భయం కలగాలి

వరంగల్‌ క్రైం : నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నిందితులకు కలిగించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలను కోర్టు నిరూపించి నేరస్తులకు శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో పాటు దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందిని సీపీ అభినందిస్తూ మంగళవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. గతేడాది నుంచి నేటివరకు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 41 కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలకు కోర్టులో శిక్షలు అమలయ్యాయని తెలిపారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, ప్రాసిక్యూషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాము, ఏసీపీలు డేవిడ్‌రాజు, సతీశ్‌బాబు, సదయ్య, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు శ్రీనివాస్‌, సంతోషి, రవి కిరణ్‌, హరిచంద్ర ప్రసాద్‌, బృందా దేవి, దుర్గాబాయి, రాజమల్లారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, రవీందర్‌ రావు, కిరణ్‌ కుమార్‌, నీజర, ఇన్‌స్పెక్టర్లు సంజీవ్‌ రావు, మల్లయ్య పాల్గొన్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్‌ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను కమిషనర్‌ మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు డీసీపీలు సురేష్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఏసీపీలు అంతయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు సతీష్‌, స్పర్జన్‌ రాజ్‌, హనుమకొండ ఇన్‌న్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ఆర్‌ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement