కాజీపేట రూరల్ : సమాజ అభివృద్ధి, సామాజిక పరివర్తనలో బాలవికాస అందిస్తున్న సేవలు అభినందనీయమని ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీటీడీసీ సెంటర్‌లో బాలవికాస, విశ్వయువక్ కేంద్రం న్యూఢిల్లీ సంయ్తుకంగా నిర్వహిస్తున్న జాతీయ వర్క్‌షాప్ ముగింపులో మంగళవారం మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ 80 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుస్తున్న బాలవికాస సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్‌డీ రాంకుమార్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన, సామర్థ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వివిధ చర్యలు చేపడుతున్నా బాలవికాస వంటి సంస్థలు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు గ్రామీణ స్థాయి పరివర్తనలో మార్పు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాలవికాస పీటీడీసీ డైరెక్టర్ సునీతరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ రవీణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమ, ఆఫీసర్ మంజునాథ్ పాల్గొన్నారు.
కుడా చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి


