ఖిలా వరంగల్: మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్‌ను సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్‌కు టీజీ ఎస్పీ కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించగా.. కలెక్టర్‌కు పోలీసులు గౌరవందనం సమర్పించారు. అనంతరం కమాండెంట్‌తో కలిసి కలెక్టర్.. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి అధునాతన రెస్క్యూ పరికరాలు అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఈ.వీరన్న, రాజేందర్, ఎస్డీఆర్‌ఎఫ్ ఆర్‌ఐ రవి, ఆర్‌ఐలు కార్తీక్, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్ ఉన్నారు.


