వరంగల్ అర్బన్/హన్మకొండ అర్బన్: నేను ఉమ్మడి జిల్లాకు చెందిన వాడిని.. మహా నగరంలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా అని గ్రేటర్ వరంగల్ కమిషనర్ తేజవత్ వెంకన్న అన్నారు. సమన్వయంతో సత్ఫలితాలను అందిస్తానని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని బాధ్యతాయుతంగా పరిష్కరిస్తానన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత భద్రకాళి అమ్మవారి ఆశ్వీరచనం తీసుకున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో చాహత్ బాజ్‌పాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, నగర ప్రజలకు మెరుగైన సేవలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. బల్దియాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అవసరమని పేర్కొన్నారు. నగరాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని, జర్నలిస్టుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ వారి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అధికారులు, ఉద్యోగులు కమిషనర్ కలిసి పూలమొక్కలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
మెరుగైన పాలన అందిద్దాం..
క్షేత్రస్థాయి కార్మికుడి నుంచి వింగ్ అధికారి వరకు సమన్వయంతో పని చేద్దామని, మహా నగర ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రేటర్ వరంగల్ కమిషనర్ తేజవత్ వెంకన్న సూచించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పౌరుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ప న్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు ఉన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి
ప్రాధాన్యమిస్తా
మహానగరంలో విధులు
నిర్వర్తించాలన్నది నా కల
కమిషనర్ తేజవత్ వెంకన్న..
బాధ్యతల స్వీకరణ


