అప్‌గ్రేడ్‌ అయినా స్లో.. | - | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడ్‌ అయినా స్లో..

Jun 30 2026 1:06 AM | Updated on Jun 30 2026 1:06 AM

కాజీపేట అర్బన్‌: రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ వెబ్‌సైట్‌, సర్వర్‌ మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు స్లోగా ముగిశాయంటూ సోమవారం భూక్రయవిక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ వెబ్‌సైట్‌తో పాటు సర్వర్‌ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపేశారు. కాగా, సోమవారంతో మళ్లీ మొదలైన రిజిస్ట్రేషన్లు స్పీడ్‌గా జరుగుతాయని ఆశించినప్పటికీ భూక్రయవిక్రయదారులకు నిరాశే మిగిలింది. సోమవారం 108 స్లాట్స్‌కు గాను 86 స్లాట్స్‌ బుక్‌ కాగా, ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం మూడు దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నా యి. సర్వర్‌ మొరాయించడంతో సోమవారం 86 స్లాట్లకుగాను కేవలం 56 స్లాట్స్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాయని, మిగతా స్లాట్లు రీస్లాట్స్‌ చేసుకోవాల్సిందేనని ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సైదులు తెలిపారు. దీంతో భూక్రయవిక్రయదారులు సా యంత్రం 7 గంటల వరకు వరంగల్‌ ఆర్‌ఓ కార్యాలయంలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement