● ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత
● బాలవికాసలో
జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం
కాజీపేట రూరల్: నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించాలని, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం కోసం జాతీయ వర్క్‌షాప్ వంటివి ఎంతో దోహదపడతాయని హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సోమవారం బాలవికాస, విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ వారి భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రారంభించారు. ‘మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు–ఒత్తిడి నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి’ అంశంపై ముఖ్య అతిథిగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్‌నేత మాట్లాడుతూ యువతకు శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో, మానసిక దృఢత్వం అంతే ముఖ్యమన్నారు. బాలవికాస పీడీటీసీ డైరెక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలవికాస పీడీటీసీ 24 ఏళ్లుగా ఎన్నో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, ఈ జాతీయ వర్క్‌షాప్‌లు యువతకు ఎంతో మేలు చేస్తాయన్నారు. బ్రహ్మకుమారి సంస్థకు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ నుంచి హాజరైన ప్రోగ్రాం ఆఫీసర్ మంజునాథ్, 8 రాష్ట్రాల నుంచి 100 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


