● వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజల అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 249 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అవకతవకలకు తావివ్వొద్దు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు. ఈ మేరకు డీఈఓ రంగయ్య నాయుడికి సంఘం ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాదరావుతో కలిసి సోమవారం వినతిపత్రం అందించారు.


