కాశిబుగ్గ: తెలంగాణలో ఆదర్శ బ్యాంకుగా అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు సేవలు అందిస్తున్నామని ఆ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ తిలక్ రోడ్డులోని కేవీఎస్ ఫంక్షన్ హాల్‌లో బ్యాంక్ 30వ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు మంచి లాభాలతో నడుస్తోందని, వచ్చే సంవత్సరం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శాఖలను విస్తరించనున్నట్లు తెలిపారు. వాటాదారుల సంక్షేమంలో భాగంగా కి డ్నీ ఆపరేషన్ చేయించుకున్న వారికి వైద్య సాయం కింద రూ.25,116 అందిస్తున్నట్లు, ఇక నుంచి ఈ డ బ్బులను రూ.40 వేలకు పెంచుతామన్నారు. గుండె జబ్బులతో బాధపడే వాటాదారుల పిల్లలకు బ్యాంకు తరఫున ఆర్థికసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు సేవలను వరంగల్ జిల్లా ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు కూరపాటి చంద్రమౌళి, పొన్న హరినాథ్, వడ్నాల సదానందం, ముందాడ వేణుగోపాల్, చకిలం ఉపేందర్, నీలం మల్లేశం, పత్తి కృష్ణ, ఎండీ పాషా, కృష్ణమూర్తి, సుజన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు పాల్గొన్నారు.
● చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
● ఘనంగా 30వ మహాజన సభ


