వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ రెడ్డికాలనీలోని వికాస్ మాస్టర్‌జీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు ఆదివారం ముగిశాయి. ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రాండ్ చాంపియన్ అర్జున్‌ను స్ఫూర్తిగా తీసుకుని చెస్‌లో రాణించాలన్నారు. పాఠశాల ఏఓ నాగరాజు మాట్లాడుతూ చిన్నారులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ ఆట, చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూలై 11, 12వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. ఆర్బిటర్స్ ప్రేమ్‌సాగర్, రజనీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


