హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం కిట్స్ కళాశాలలో కౌశల్ మహోత్సవ్–2026 కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి సతీశ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 101 కంపెనీలను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 6 వేల మంది నిరుద్యోగులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని నిర్వాహకులు తెలిపారు. స్కిల్ ఇండియా తెలంగాణ డైరెక్టర్ కపిలవాయి దిలీప్‌కుమార్, కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వీఎస్ అరవింద్, మాజీఎంపీ సీతారాంనాయక్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్ వినోద్‌కుమార్, యూబీఐ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కోమల్‌రెడ్డి, ఏఓ డాక్టర్ రమేశ్‌రెడ్డి, పీఆర్వో డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.


