కమిషనర్‌కు అద్దె వాహనమే దిక్కు.. | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌కు అద్దె వాహనమే దిక్కు..

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

కమిషనర్‌కు అద్దె వాహనమే దిక్కు..

హెచ్‌ఎండీఏలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తేజావత్‌ వెంకన్న గ్రేటర్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వాహనం లేదు. అద్దె వాహనాన్ని తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయమై బల్దియా వాహనాల ఇన్‌చార్జ్‌ డీఈ మహేందర్‌ను వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చాను. కమిషనర్‌ వినియోగించిన వాహనం పదేళ్లు దాటినందున మూడుసార్లు టెండర్లు పిలిచారు. కానీ, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా కొత్త వాహనం కోసం షో రూంకు ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. కొత్త కమిషనర్‌కు వాహనం కేటాయించే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement