రాలని చినుకు.. రైతుల్లో వణుకు | - | Sakshi
Sakshi News home page

రాలని చినుకు.. రైతుల్లో వణుకు

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

రాలని చినుకు.. రైతుల్లో వణుకు

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17 జిల్లాలు వర్షపాతం లోటుతో ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నా, సరిపడా వానలు లేక సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్‌ 1 నుంచి 24 వరకు రాష్ట్రంలో సాధారణంగా 101.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 84.9 మిల్లీమీటర్లే కురిసింది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే సాగు పనులు ఊపందుకునే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

హనుమకొండ జిల్లాలో

27 మిల్లీమీటర్ల వర్షపాతం

హన్మకొండ: వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో హనుమకొండ జిల్లాలో వర్షాలు రోజురోజుకూ దూరమవుతున్నాయి. గత సంవత్సరం జూన్‌ 26 నాటికి జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 79.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది ఇదే సమయానికి జిల్లా సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 54,790 ఎకరాల్లో సాగు చేశారు.

ఉమ్మడి జిల్లాలో 58 శాతం

లోటు వర్షపాతం

నత్తనడకన సాగుతున్న

వ్యవసాయ పనులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement