హసన్‌పర్తి: నేర్చుకోవాలనే ఆసక్తిన్నవారికి సృజనాత్మక రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ, హామ్‌స్టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సార్ యూ ‘స్కూల్ ఆఫ్ డిజైన్ పవర్డ్ బై హాక్‌స్టెక్’ను శనివారం నీతా లుల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీతా లుల్లా మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా డిజైన్ విద్య కూడా నిరంతరం మారాలని సూచించారు. హామ్‌స్టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అజితా యోగేష్ మాట్లాడుతూ మూడు దశలుగా డిజైన్ విద్యలో హామ్‌స్టెక్ సంపాదించిన అనుభవాన్ని ఎస్సార్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ విద్యార్థులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ నిపుణుల మార్గదర్శకత్వం, అంతర్జాతీయ అవకాశాలు, విజయవంతమైన కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించడంలో ఎస్సార్ యూ స్కూల్ ఆఫ్ డిజైన్ ముందు వరుసలో ఉంటోందని చెప్పారు. ఈ సందర్భంగా నీతా లుల్లా బృందం ర్యాంపుపై ప్రదర్శనలు ఇచ్చింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా
ఎస్సార్‌యూలో డిజైన్ స్కూల్ ప్రారంభం


