‘కుడా’లో కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

‘కుడా’లో కుంభకోణం

Jun 27 2026 12:49 AM | Updated on Jun 27 2026 12:49 AM

‘కుడా’లో కుంభకోణం

మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ: ప్లాట్ల వేలంలో ‘కుడా’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణానికి పాల్పడ్డారని ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల వేలంలో కమీషన్‌ తీసుకుని కాకతీయ పట్టణాభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. గజానికి బహిరంగ మార్కెట్‌లో రూ.1.30 లక్షలుండగా.. అగ్గువకు గజానికి రూ.65 వేల నుంచి రూ.69 వేల వరకు విక్రయించారని ఆరోపించారు. ‘కుడా’ వైస్‌ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ ప్లాట్ల వేలంలో జరిగిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. దాదాపు రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని, వేలాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సిరాజుద్దీన్‌, దర్శన్‌ సింగ్‌, సోదా కిరణ్‌, బొంగు అశోక్‌ యాదవ్‌, జోరిక రమేష్‌, కుసుమ లక్ష్మీ నారాయణ, పులి సారంగపాణి, నయీమొద్దీన్‌, నార్లగిరి రమేశ్‌, సల్వాజి రవీందర్‌ రావు, గండు అశోక్‌ యాదవ్‌, గౌస్‌ ఖాన్‌, శ్రీధర్‌, అఫ్జల్‌, రామ్మూర్తి, ప్రభాకర్‌, గండ్రకోట రాకేష్‌ యాదవ్‌, శివకుమార్‌, షాబాద్‌, ఎస్కే మహమూద్‌, ఫెరోజ్‌, శ్యామ్‌ రెడ్డి, మనోజ్‌, కనకరాజు, నాయిని రవి యాదవ్‌, తక్కళ్లపల్లి వినీల్‌ రావు, శ్రీకాంత్‌ చారి, పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement