పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని 30వ డివిజన్ శ్రీనివాస్ నగర్‌లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన మహిళా కమ్యూనిటీహాల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.


