ఆక్రమణలతో ఇబ్బంది పడుతున్న పాదచారులు షాపులు.. షెడ్లు.. డబ్బాలతో గందరగోళం అద్దెకిస్తూ నాయకుల వసూళ్లు అధికారుల మౌనంతో ప్రజలకు అవస్థలు హైకోర్టు ఆగ్రహంతోనైనా ఆక్రమణలు తొలగేనా?
●
నగరంలోని హనుమకొండ చౌరస్తా,
నయీంనగర్, బాలసముద్రం, కిషన్‌పుర, కేయూసీ, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, జేపీఎన్ రోడ్డు, హంటర్ రోడ్డు, నక్కలగుట్ట, బస్టాండ్ ఏరియా, కాజీపేట తదితర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడో ఒక చోట చిరు వ్యాపారులు తాత్కాలికంగా వ్యాపారం చేస్తుండగా, మరికొన్ని చోట్ల శాశ్వత ఆక్రమణలు ఏర్పడ్డాయి.


