నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత | - | Sakshi
Sakshi News home page

నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌

చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత పెడతామని హనుమకొండ కలెక్టర్‌, గ్రేటర్‌ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. వరంగల్‌లో ఏనుమాముల ఏరియా, ధర్మారం రోడ్డు, డాక్టర్స్‌కాలనీ, కాశిబుగ్గలో గురువారం ఆమె పర్యటించారు. అభివృద్ధి పనులు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలిచ్చారు. కాశిబుగ్గ సీతారామాంజనేయ ఆలయంలో పూర్తి చేసిన గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనులను కలెక్టర్‌ కొలతలు వేసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ సంతోశ్‌బాబు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, డీఈలు రంగారావు, సురేశ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement