మిగిలిన ఏడు ఎకరాల భూమి గుంటలుగా ఉండటంతో వాటి స్వరూపం, విస్తీర్ణం, యాజమాన్య వివరాల నిర్ధారణ కోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే పరిహారం చెల్లించనున్నారు. మరో 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు భూమి హద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్‌లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులను టెండర్లు పిలిచే అవకాశముంది. ఇప్పటికే రన్‌వే రహదారి గురించి నిట్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్ –2016 (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం కింద మామూనూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది అందుబాటులోకి వస్తే అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశముంది.


