హనుమకొండ అదనపు కలెక్టర్ రవి
హన్మకొండ అర్బన్: వనమహోత్సవంలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, మరుగుదొడ్ల నిర్మాణంపై జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జెడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్‌డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్‌రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.


