న్యూస్‌రీల్
నేటి నుంచి ప్రత్యేక ఓటరు
జాబితా సమగ్ర సవరణ
వివరాలు సేకరిస్తున్న
బీఎల్‌ఓ
● నెల రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ
● అవగాహన కోసం ప్రజలకు పలు సూచనలు
● హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు
ఓటర్ల మ్యాపింగ్ 76.48 శాతం..
● దామెర మండలం అగ్రస్థానం,
వరంగల్ మండలం చివరి స్థానం
హన్మకొండ అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 25 (గురువారం) నుంచి జూలై 24 వరకు ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్ –2026) కార్యక్రమం చేపట్టనున్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం, వివరాల్లో ఉన్న పొరపాట్లను సరిచేయడం, అనర్హుల పేర్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ల మ్యాపింగ్ 76.48 శాతం పూర్తయ్యింది.
జిల్లాలో కార్యక్రమాలు ఇలా..
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా బీఎల్‌ఓ యాప్ ద్వారా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో జూన్ 24 నాటికి మొత్తం 5,09,014 మంది ఓటర్లలో 3,89,306 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, 1,19,708 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్‌లో ఉంది. జిల్లా వ్యాప్తంగా మ్యాపింగ్ శాతం 76.48గా నమోదైంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటి ఇంటి వివరాల సేకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
ఈ ప్రక్రియ ద్వారా చేయగలిగేవి..
కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు చేయించుకోవడం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారిన వివరాలను నవీకరించుకోవడం. మరణించిన లేదా అనర్హుల పేర్ల తొలగింపునకు సమాచారం అందించడం.
ప్రజలకు సూచన..
అర్హులైన ప్రతిఒక్కరూ తమ పేరు ఓటరు జాబితా లో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. బూత్ స్థాయి అధికారులకు సహకరించి అవసరమైన వివరాలు, పత్రాలు అందించాలి. వివరాలకు ఓటరు సహాయ కేంద్రం నంబర్ 1950లో సంప్రదించవచ్చు.
పర్యవేక్షణ..
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తారు.
నియోజకవర్గాలవారీగా చూస్తే..
● పరకాల నియోజకవర్గం 87.36 శాతం మ్యాపింగ్‌తో ముందంజలో ఉండగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 68.02 శాతం మాత్రమే నమోదైంది. రెండు నియోజకవర్గాల మధ్య దాదాపు 19.34 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది.
● మండలాల వారీగా చూస్తే దామెర మండలం 92.12 శాతం మ్యాపింగ్‌తో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆత్మకూరు మండలం (90.94 శాతం), నడికూడ (90.92 శాతం) మండలాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు వరంగల్ మండలంలో 66.02 శాతం మాత్రమే మ్యాపింగ్ నమో దై జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. హనుమకొండ మండలంలో 67.73 శాతం, కాజీపేట మండలంలో 69.50 శాతం మ్యాపింగ్ నమోదైంది.
● ఓటర్ల సంఖ్య పరంగా హనుమకొండ మండలం ముందంజలో ఉంది. ఈ మండలంలో 2,10,521 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,42,584 మంది మ్యాపింగ్ పూర్తయ్యింది. అదే మండలంలో అత్యధికంగా 67,937 మంది ఓటర్ల మ్యాపింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది.
హనుమకొండ జిల్లా మొత్తం మ్యాపింగ్ : 76.48%
జిల్లా మొత్తం ఓటర్లు:
5,09,014
మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు:
3,89,306
వ స్థానం
నడికూడ
వ స్థానం
ఆత్మకూర్
వరంగల్ పశ్చిమ
68.02%
పరకాల
87.36%
నియోజకవర్గాల
వారీగా మ్యాపింగ్
పెండింగ్‌లో ఉన్న ఓటర్లు:
1,19,708
అవసరమైన ఆధారపత్రాలు
జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్‌్స్, విద్యాసంస్థల ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ శాఖలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అధికారిక ఆధార పత్రాలు.
ఇంటింటి సర్వేలో
ఏం జరుగుతుంది?
బూత్‌స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారు. అనంతరం ప్రతి ఓటరుకు వివరాల నమోదు పత్రం అందజేస్తారు. ఓటర్లు పత్రాన్ని పూర్తిగా నింపి అవసరమైన ఆధారాలతో అధికారికి అందజేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా కూడా వివరాలను సమర్పించే అవకాశం ఉంటుంది. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక వర్గాల వారికి బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సాయం అందిస్తారు.


