రామన్నపేట: జిల్లాలో ఈనెల 28 నిర్వహించే పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ ఎస్‌డీ రాంకుమార్ వైద్యాధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో 84,301 మంది ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించా ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని 42 మంది టీబీ వ్యాధిగ్రస్తుల ఖాతాల్లో నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా రూ.వెయ్యి చొప్పున జమ చేసినట్లు డీఎంహెచ్‌ఓ రాంకుమార్ తెలిపారు. డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్.రజిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ తదితరులు ఏర్పాట్లపై సమీక్షించారు.


