రామన్నపేట: మీజిల్స్, రుబెల్లా, పోలియో నియంత్రణలో భాగంగా పిల్లల్లో జ్వరంతో పాటు దద్దుర్లు ఉన్నా, పిల్లల శరీరంలోని ఏ భాగమైన పాక్షికంగా బలహీనపడినా వారి పూర్తి వివరాలను వెంటనే డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ ఎస్‌డీ రామ్‌కుమార్ సూచించారు. మీజిల్స్ రుబెల్లా సర్వేలెన్స్ (నిఘా)లో భాగంగా మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పిల్ల ల వైద్య నిపుణులు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరకాల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, పిల్లల వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.రమేశ్, కోశాధికారి డాక్టర్ అన్వేషిని, డిప్యూటీ సివిల్ సర్జన్లు డాక్టర్ రజిత, డాక్టర్ మురళి, జీఎంహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మానస నరహరి, ప్రోగ్రాం అధికారులు జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రుబీనా, డెమో వి.అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి విజయలక్ష్మి, తదితరులున్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం ప్రారంభమైన పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మూడు రోజుల పాటు జరుగనున్న పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో అధికారులు, సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు.
కేయూ క్యాంపస్: తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 7వ వార్షిక సదస్సును ఈనెల 25న కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో నిర్వహించనున్నారు. వర్సి టీ కాలేజీ ఆఫ్ కామర్స్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్‌భారత్–47 న్యూ డైమెన్షన్స్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌ది ఎరా ఆఫ్ యాక్ట్’ అంశంపై ఈసదస్సును నిర్వహించనున్నారు. ఇందులో కృత్రిమ మేధ ప్రభావం, వ్యాపార విశ్లేషణ, ఆర్థిక రంగం, ఫిన్‌టిక్ స్టార్టప్‌లు, మార్కెటింగ్, మానవ వనరుల అభివృద్ధిపై చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కాజీపేట అర్బన్: నిట్ కళాశాలలో అగ్నిమాపక భద్రత అవగాహన, శిక్షణలో భాగంగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్‌ఐఎఫ్) తెలంగాణ అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ సహకారంతో మంగళవారం ఉద్యోగులు, పరిశోధన విద్యార్థుల కోసం అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా అగ్నిమాపక అధికారి సుదర్శన్ రెడ్డి రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నిట్ వరంగల్ విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ప్రొఫెసర్ కె.కిరణ్‌కుమార్, సీఆర్‌ఐఎఫ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎ.వీరేశ్‌బాబు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ డి.రవీందర్‌రెడ్డి, నిట్ వరంగల్ అగ్నిమాపక భద్రతా అధికారి, కార్యక్రమ సమన్వయకర్త సజిత్, అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో 2026–27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం (స్టూడెంట్స్ సర్వీసెస్) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ లేదా పీజీ చేయాలనుకునేవారు సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ, ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాల్లోనూ ఆగస్టు 7లోగా సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 18005990101, 04023680333, 040 23680444, ఫోన్ చేయొచ్చని సూచించారు.


