హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. హనుమకొండ వాజ్‌పేయి నగర్, లష్కర్ బజార్‌లోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో నిర్మిస్తున్న ఇండోర్ సబ్‌స్టేషన్ల పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం, పట్టణ ప్రాంతాల్లో స్థలభావ సమస్యను అధిగమించడానికి ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంస్థ పరిధిలోని పలు జిల్లాల్లో ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్య నాయక్, టౌన్ డీఈ (ఆపరేషన్) జి.సాంబారెడ్డి, డీఈ (ఎమ్మార్టీ, కన్‌స్ట్రక్షన్) ఎ.విజేందర్ రెడ్డి, డి.ఈ టెక్నికల్ భాస్కర్, నయీంనగర్ ఏడీ రాజు, సివిల్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏ.డీ.ఈ హుస్సేన్, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


