సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల ధర్నా

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల ధర్నా

హన్మకొండ: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం హనుమకొండ అదాలత్‌ కూడలిలోని హనుమకొండ పోస్టల్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు ధర్నా చేశారు. ఈధర్నాలో యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి, డివిజన్‌ ప్రెసిడెంట్‌ పెరుమాండ్ల తిరుపతి, నాయకులు జె.కుమారస్వామి, జాటోత్‌ బాపూజీ, ఎం.ఆనందం, ఎన్‌.శ్రీనివాస్‌, జి.వీరన్న, బి.సుధాకర్‌రెడ్డి, జి.లక్ష్మీనారాయణ, రమేశ్‌, శ్రీలత, దేవి, ఇందిర, కల్పన, రాణి, సాంబమూర్తి, యూసుఫుద్దీన్‌, పిట్టల అశోక్‌, రాజ్‌కుమార్‌, సోమలింగం, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement