పీజీ సైన్స్‌ కోర్సుల నూతన సిలబస్‌కు ఆమోదం | - | Sakshi
Sakshi News home page

పీజీ సైన్స్‌ కోర్సుల నూతన సిలబస్‌కు ఆమోదం

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

కేయూ క్యాంపస్‌ : అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా నాన్‌ప్రొఫెషనల్‌ పీజీ సైన్స్‌ కోర్సుల నూతన సిలబస్‌ను ఆమోదించారు. మంగళవారం కేయూలో సైన్స్‌ విభాగాల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్లు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, ఓయూ, కేయూ సైన్స్‌ విభాగాల డీన్లు జితేందర్‌నాయక్‌, హనుమంతు, అకడమిక్‌ విభాగం అసిస్టెంట్‌ రిజి స్ట్రార్‌ కోలశంకర్‌ పాల్గొన్నారు. నాన్‌ ప్రొఫెషనల్‌ పీజీ సైన్స్‌ కోర్సుల సవరించిన సిలబస్‌ను ఇప్పటికే రూపొందించిన అంశాలపై బీఓఎస్‌లు వివరించాక ఆమోదించారు. వాల్యూయాడెడ్‌ ఇంటర్‌డిసిప్లినరీ, స్కిల్‌హెన్‌హ్యాన్స్‌మెంట్‌, ఒకేషనల్‌, ఓపెన్‌ ఎలక్టివ్‌ కోర్సులతోపాటు క్లాంటంటెక్నాలజీ, ఏఐ, రీసెర్చ్‌ మెథడాలజీ, రీసెర్చ్‌ప్రాజెక్టు వంటి అంశాలను ప్రవేశపెట్టి చర్చించారు. అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా అవుట్‌కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌, సస్టెయినబుల్‌ గోల్స్‌ ఆధారంగా పాఠ్యాంశాలను రూపొందించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement