హన్మకొండ : వరంగల్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్–1) చైర్మన్‌గా జి.నాగప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పని చేస్తున్న ఎన్.వేణుగోపాలచారి పదవీ కాలం పూర్తి కావడంతో టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కమర్షియల్ చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.నాగప్రసాద్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో సీజీఆర్‌ఎఫ్–1గా నియమిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నాగప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఽభ్యులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


