సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షురూ | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షురూ

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షురూ

కేయూ క్యాంపస్‌: టీజీఈఎప్‌సెట్‌ 2026 (ఎంపీసీ–స్ట్రీమ్‌) అభ్యర్థులకు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో, వర్సిటీ క్యాంపస్‌లోని అడ్మిషన్ల డైరెక్టర్‌ కార్యాలయం, వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్లలో అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ ఈనెల 29 వరకు కొనసాగనుంది. సోమవారం ఆయా హెల్ప్‌ లైన్‌ సెంటర్లలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకున్న అభ్యర్థులకు అధికారులు ధ్రువపత్రాలు అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement