వరంగల్ చౌరస్తా : విద్యార్థి దశ నుంచి వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని కేయూ సహాయ సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృఽథ్వీరాజ్ సూచించారు. అదివారం వరంగల్ పిన్నావారి వీధిలోని ఆర్య సమాజ్ భవనంలో వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పెద్దల పర్యవేక్షణలో పరిమిత కాలం మాత్రమే సోషల్ మీడియాను వినియోగించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అ వసరమని తెలిపారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు, స్థానిక పెద్దలు బండి కిషన్, గన్ను జయప్రకాశ్, అల్లోజు వెంకటేశ్వర్లు, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


