నయీంనగర్: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూ త న కమిటీని ఎన్ని కల అధి కారి కంకణాల సంతోష్ ఆదివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయిరాం), కోశాధికా రిగా పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులుగా దండు మోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయ్‌భాస్కర్, అల్లె రామారావు, సహ కార్యదర్శులుగా జి.బాలరాజు, గన్ను సంతోష్‌కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్‌పాషా, కార్యవర్గ సభ్యులుగా డి.రాధాకృష్ణ, జి.రామానుజం, పి.ప్రదీప్‌రాజ్, ఎండీ జమాలొద్దీన్, ఎ.సాంబశివరాజు, ఎండీ ఉస్మాన్‌పాషా, ఎండీ ఫజర్ ఉర్ రహమాన్, ఎ.విష్ణువర్ధన్‌రాజు, ఆర్. శ్రీధర్, ఎం.ఓదెలు, శివకుమార్, సుధాకర్, దామోదర్, ఎం.సంతోష్, పి.రాజేందర్, ఇ.జగన్, ఎ.కొ మ్మాలు, ఎన్నికై నట్లు సంతోష్ పేర్కొన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు ఎన్నిక నిర్వహించారు. మొ త్తం 407 ఓట్లకు 217 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన గడ్డం కేశవమూర్తికి 208 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి గుంటి విద్యాసాగర్‌కు 4 ఓట్లు వచ్చాయి. 5 ఓట్లు చెల్లలేదు. కార్యదర్శి పదవికి పో టీచేసిన ఊటుకూరి సీతారామారావుకు పోలైన 217 ఓట్లలో 204 ఓట్లు రాగా.. ప్రత్యర్థి మే రుగు రాజేంద్రప్రసాద్‌కు 7 ఓట్లు రాగా.. 6 ఓట్లు చెల్లలేదు. ఎన్నికలు నిర్వహించిన ఆర్‌ఓ సంతోష్, ఏఆర్‌ఓలు, అబ్జర్వర్లుగా వ్యవహరించిన మధు, పీవీ మదన్‌మోహన్, పిన్నా శివకుమార్, వ ల్లాల వెంకటరమణ, పెండెం వేణుమాధవ్, సహా యకులను రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ అభినందించారు.


