చెత్త శాంపిళ్లను సమర్థంగా సేకరించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా పలు డివిజన్ల నుంచి ఏరకమైన తడి, పొడి చెత్త సేకరణ జరుగుతుందని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. శుక్రవారం వరంగల్ పరిధి పోతన నగర్, బల్దియా ఆవరణలోని బయో మిథనైజేషన్ ప్లాంట్‌తో పాటు ఎన్‌ఐయూఏ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫ్సైర్స్) వారు సేకరిస్తున్న చెత్త శాంపిళ్ల తీరును కమిషనర్ పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏ రకమైన చెత్త వస్తుందో ఎన్‌ఐయూఏ ప్రతినిధులు చేస్తున్న అధ్యయనానికి సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మధు, రాజు పాల్గొన్నారు.


