హౌరా బ్రిడ్జిని మరిపించేలా..
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జిని తలపించేలా ఇనుప గడ్డర్లతో నూతన మోడల్‌లో రైల్వే లైన్‌పై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడం, నిత్యం వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ గడ్డర్ల పనులు సకాలంలో పూర్తి చేసి రైల్వేలైన్‌పై ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
రైల్వే లైన్‌పై నిలిచిన పనులు..
రైల్వే లైన్‌కు ఇరువైపులా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రైల్వే విద్యుత్‌లైన్‌పై పనులు చేపట్టాలంటే జీఎం స్థాయిలో ముందస్తు అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజాప్రతినిధుల చొరవతో రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా సాగుతాయనే ఆశాభావాన్ని పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.


