వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్
హన్మకొండ/ఎంజీఎం: వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎ.అప్పయ్య, బి.సాంబశివరావుతో కలిసి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అమరావతినగర్‌లో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. మూడు రోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వడ్డేపల్లి వైద్యాధికారి మాలికను అడిగి తెలుసుకున్నారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి జీడబ్ల్యూఎంసీ తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం హనుమకొండ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం అధికారుల సమీక్షలో రవీంద్రనాయక్ మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.మదన్మోహన్‌రావు, టీబీ నియంత్రణాధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారులు ఇక్తదార్ అహ్మద్, జ్ఞానేశ్వర్, మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రకాశ్, కొమురయ్య, మోహన్ సింగ్, విజయకుమార్, ఉదయరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


