రుద్రేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన
రుద్రేశ్వర స్వామికి శనివారం ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. సాయంత్రం మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం నేడు తులసీధాత్రి కల్యాణం నిర్వహించనున్నారు. కార్తీక సమారాధన నిర్వహించనున్నారు.
– హన్మకొండ కల్చరల్
మేయర్, కమిషనర్ సమీక్ష
వరంగల్ అర్బన్: ముంపునకు కారణమవుతున్న చెరువులు, నాలాల విస్తీర్ణంపై నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. బల్దియా ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించారు. ప్రాథమికంగా రూపకల్పన చేసిన రూ.355 కోట్లతో నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్స్ సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలను సేకరించారు.
నయీంనగర్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి యూత్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్న ట్లు వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు కేఆర్.దివ్యజ రాజ్, కార్యదర్శి శ్రీని వాసరావు ప్రకటనలో తెలిపారు. వివరాలకు 944 03 80857 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


