
వనదేవతల హుండీ ఆదాయం రూ.27 లక్షలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ కానుకల హుండీ ఆదాయం రూ.27,00,177 వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. బుధవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో హుండీలను సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల సమక్షంలో లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.15,16,975, సారలమ్మ రూ.10,96,025, గోవిందరాజు రూ.41,956, పగిడిద్దరాజు రూ. 36,321, నోట్లు రూ.8,900 మొత్తం ఆదాయం రూ.27,00,177 వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. కాగా, అమ్మవార్ల హుండీ ఆదాయం ఈసారి తగ్గింది. వర్షాలు, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేడారానికి భక్తుల రద్దీ తగ్గడంతోనే ఈసారి ఆదాయం తగ్గినట్లు పూజారులు భావిస్తున్నారు.