పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య

Oct 9 2025 2:36 AM | Updated on Oct 9 2025 2:36 AM

పాపయ్

పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య

నర్సంపేట రూరల్‌ : అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవుల వెంకన్న (60)కు మానసిక స్థితి బాగలేదు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో

ఎల్లంల గ్రామంలో వ్యక్తి..

జనగామ రూరల్‌: ఆర్థిక ఇబ్బందులతోఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లంల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వా సు( 55) చేనేత వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నా డు. కుటుంబ పోషణ నిమిత్తం సుమారు రూ. 20లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పు తీర్చలేక మార్గం కనిపించకపోవడంతో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘ టనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విషజ్వరంతో బాలుడి మృతి

బయ్యారం: విషజ్వరంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని జగ్గుతండాలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన చెందిన గోలి సుబ్బారావు కుమారుడు అజయ్‌(15)కి 10 రోజుల క్రితం విషజ్వరం వచ్చింది. దీంతో మహబూబాబాద్‌, వరంగల్‌లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయినా తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కాగా, అజయ్‌ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

సైబర్‌ మోసం..

యాప్‌ రివ్యూ పేరుతో డబ్బు

కొల్లగొట్టిన కేటుగాళ్లు

మహబూబాబాద్‌ రూరల్‌ : టెలిగ్రామ్‌ యాప్‌ రివ్యూ పేరుతో సైబర్‌ నేరగాళ్లు డబ్బు కొల్ల గొట్టారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు మహబూ బాబాద్‌ టౌన్‌ సీఐ మహేందర్‌ రెడ్డి బుధవారం తెలిపారు. సెప్టెంబర్‌ 27వ తేదీన సైబర్‌ నేరగాళ్లు మహబూబాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా టెలిగ్రామ్‌ యాప్‌లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని లింకులు పంపించారు. ఆ లింక్‌ ద్వారా యాప్‌లో జాయి న్‌ అవ్వగా రివ్యూ చెప్పాలంటే రూ.12 వేలు పంపాలని సైబర్‌ నేరగాళ్లు చెప్పగా బాధితుడు పంపాడు. అనంతరం మరో రూ.38 వేలు పంపాడు. మరోసారి రూ.60 వేలు పంపించాలని అడగగా బాధితుడికి అనుమానం వచ్చింది. వాళ్లు చెప్పిన విధంగా పంపినా తన ఖాతాలో జమ చేయకుండా ఇంకా డబ్బులు అడుగుతున్న విషయాన్ని గుర్తించాడు. తాను సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి స్థానిక టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

పాపయ్యపేటలో  వృద్ధుడి ఆత్మహత్య
1
1/2

పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య

పాపయ్యపేటలో  వృద్ధుడి ఆత్మహత్య
2
2/2

పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement