
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
హన్మకొండ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికై నా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు అని, కాంగ్రెస్ నాయకులు వక్రభాష్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంపై గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్ పెండింగ్‌లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్‌కు నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సమాంతర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు జోరిక రమేశ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రవీందర్ రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, పోలెపల్లి రామ్మూర్తి, బొల్లికొండ వీరేందర్, బుద్దె వెంకన్న, మూటిక రాజు, రమేశ్, శ్రీకాంత్ చారి, మహేందర్, సతీశ్, దేవమ్మ, గౌస్‌ఖాన్, జేకే పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు