మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? | - | Sakshi
Sakshi News home page

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

Apr 30 2025 12:05 AM | Updated on Apr 30 2025 12:05 AM

మనకెప

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

ఇవీ సమస్యలు..

అసౌకర్యాల నడుమ క్రికెట్‌ శిక్షణ

వరంగల్‌ క్రికెట్‌ సంఘానికి

సొంత మైదానం కరువు

ప్రాక్టీస్‌కు ప్రైవేట్‌ పిచ్‌లను

ఆశ్రయించాల్సిందే..

వరంగల్‌ స్పోర్ట్స్‌ : క్రికెట్‌ అభిమానుల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా వైభవ్‌ సూర్యవంశి.. నిన్నటి వరకు ఎవరో తెలియని వైభవ్‌, తన సత్తా చాటి ఐపీఎల్‌లో కొత్త చరిత్రను సృష్టించాడు. 14 ఏళ్ల కుర్రాడు 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు మొత్తంగా 101 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ దిగ్గజాలను ఆకట్టుకున్నాడు. చిన్న వయస్సులోనే వైభవ్‌ ఐపీఎల్‌ సెంచరీ కొట్టడంతో డీఎస్‌ఏలో శిక్షణ పొందుతున్న పలువురు యువ క్రికెటర్లను ‘సాక్షి’ పలకరించింది. వైభవ్‌ ఆట తీరు పై అడుగుతూ, వీళ్లకేం కావాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

వైభవ్‌ ఆటను మరిచిపోలేను

రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగిన వైభవ్‌ ఆట ఆద్యంతం కట్టిపడేసింది. అంతకుముందు ఆడిన ఆటలో అంతగా ఆడని వైభవ్‌, ఈ మ్యాచ్‌లో సిక్స్‌లు, ఫోర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. పది పూర్తికాగానే హనుమకొండకు వచ్చి క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు అండర్‌–19 నేషనల్స్‌, ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ మ్యాచ్‌లో కేయూ టీం కెప్టెన్‌గా ఆడాను. ప్రాక్టీస్‌కు మరింత వసతులు కల్పిస్తే బాగా రాణిస్తాం.

– ఎం.నవ్యనాయక్‌, డిగ్రీ, కేడీసీ

హనుమకొండ

● పట్టుదల, ప్రతిభ, సత్తా ఉన్న వైభవ్‌లు మనవద్దా లేరా..మనకెప్పుడు క్రికెట్‌ వైభవం అంటూ వరంగల్‌ క్రికెట్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అనుబంధంగా వరంగల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఉన్నప్పటికీ ఒక్క వైభవ్‌ను తయారు చేయలేకపోవడం బాధాకరం. ఇన్నేళ్లలో ఒక్కరూ వరంగల్‌ నుంచి క్రికెట్‌ వైభవాన్ని ప్రపంచానికి ఎందుకు ఎలిగెత్తి చాటలేదు. అన్నింటికీ ఒకే సమాధానం క్రికెట్‌కు సొంత మైదానమే లేకపోవడం.

● హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో క్రికెట్‌ స్టేడియం లేకపోవడం ఇక్కడి క్రికెట్‌ పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శనం. హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో అనేక మంది వరంగల్‌కు వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతీసారీ అంతర్జాతీయ స్థాయిలో వరంగల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని ప్రకటనలు ఇవ్వడం, అవీ కాలగర్భంలో కలిసిపోవడం పరిపాటిగా మారింది.

● హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిత్యం క్రికెట్‌లో అనేక మంది శిక్షణ పొందుతున్నారు. అయితే డీఎస్‌ఏ అందించే శిక్షణ కేవలం గల్లీలో ఆడేంత వరకు మాత్రమే సరిపోతుంది. జేఎన్‌ఎస్‌లో సైతం ఆర్ఫో టర్ప్‌ పిచ్‌, లైటింగ్‌, బౌలింగ్‌ మిషన్‌ వంటి అధునాతన పరికరాలు అందుబాటులో లేవు. దీంతో కోచ్‌ సాధారణ శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది.

సాధారణ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌..

రెండున్నర ఏళ్లుగా డీఎస్‌ఏ కోచ్‌ అఫ్జల్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న. ప్రతి రోజు ప్రాక్టీస్‌ చేసేది సాధారణ గ్రౌండ్‌లో.. టోర్నమెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ పిచ్‌ బాగుంటుంది. దీంతో అక్కడ బ్యాటింగ్‌లో పట్టు దొరికే లోపే వికెట్లను కోల్పోవల్సి వస్తోంది. అండర్‌–17 కేటగిరీలో రెండు స్టేట్‌ మీట్‌లు ఆడాను.ఒక నేషనల్స్‌కు ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యాను.

– డి. శ్రీసహస్రరాజ్‌, హనుమకొండ

ప్రత్యేక స్టేడియం ఉండాలి

ప్రపంచంతో పోటీపడి ఆడాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. సాధనకు సరిపడా వసతులు ఉండాలి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రికెట్‌కు ప్రత్యేకంగా సొంత స్టేడియమే లేకపోవడం బాధాకరం. రోజూ ప్రాక్టీస్‌ చేసే గ్రౌండ్‌కు బరిలో దిగే గ్రౌండ్‌ మరోలా ఉంటే ఆడేందుకు కష్టపడాల్సి వస్తోంది.

– మహ్మద్‌ అఫ్జల్‌, క్రికెట్‌ కోచ్‌, డీఎస్‌ఏ

చీకటి పడితే ఇంటికి వెళ్లాల్సిందే

రెండేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నాను. స్కూల్‌ నుంచి ఇంటికెళ్లి గ్రౌండ్‌కు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. గంట ప్రాక్టీస్‌ చేయగానే చీకటి పడుతుంది. మరో గంట పాటు ప్రాక్టీస్‌ చేద్దామనుకుంటే అంతా చీకటే. ప్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తే ఎక్కువ సమయం ప్రాక్టీస్‌ చేయొచ్చు. టర్ప్‌ పిచ్‌, ప్లడ్‌ లైట్స్‌, బౌలింగ్‌ మిషన్‌ లాంటి అధునాతన సౌకర్యాలు కల్పిస్తే వరంగల్‌ నుంచి కూడా వైభవ్‌లు పుట్టుకొస్తారు.

– ఎండీ అమన్‌, హనుమకొండ

అధునాతన వసతులు

కల్పించాలి

మూడేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్న.అండర్‌–14 లో రెండు స్టేట్‌ మీట్లు ఆడాను. బ్యాట్‌ పట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఇరుకై న నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. టోర్నమెంట్లు ఉన్నప్పుడు ప్రైవేట్‌ మైదానాల్లో ఆడుతుంటాము. ఇక్కడ ప్రాక్టీస్‌ చేసి, మైదానాల్లో ఆడడం ఇబ్బందిగా ఉంటుంది. అధునాతన బౌలింగ్‌ మిషన్‌, టర్ప్‌ పిచ్‌ ఇతర వసతులు అందుబాటులో ఉంటే మా టీంలోనూ ఎందరో వైభవ్‌లు ఉన్నారు.

– విదాత్‌శర్మ, హనుమకొండ

ఏడాది నుంచి ప్రాక్టీస్‌ లేదు

ఇంతకుముందు కాకతీయ మెడికల్‌ కాలేజీ మైదానంలో శిక్షణ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు వారు అనుమతి నిరాకరించడంతో ఏడాది నుంచి క్రీడాకారులకు ప్రాక్టీస్‌ లేదు. బౌలింగ్‌ మిషన్‌, ఆస్ట్రో టర్ప్‌ పిచ్‌ ఉన్నప్పటికీ సొంత మైదానం లేకపోవడం వల్ల మెరుగైన శిక్షణ ఇవ్వలేక పోతున్నాం. వరంగల్‌లో క్రికెట్‌ స్టేడియం నిర్మించేందుకు హెచ్‌సీఏ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వాలను అనేక సార్లు వినతి పత్రాలు, ప్రతిపాదనలు పంపించాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఉంటే ప్రతిభ గల క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు.

– చాగంటి శ్రీనివాస్‌, కార్యదర్శి, వరంగల్‌ క్రికెట్‌ సంఘం

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 1
1/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 2
2/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 3
3/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 4
4/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 5
5/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 6
6/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..? 7
7/7

మనకెప్పుడు క్రికెట్‌ ‘వైభవం’..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement