జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

కాశిబుగ్గ: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దెబ్బతీస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహ్మద్‌ అయూబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌ ఎల్‌బీనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు కలిగే పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నెల 7న వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ నుంచి హనుమకొండ అంబేడ్కర్‌ వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు అయూబ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు కీలకమైన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో మేరు సంఘ కార్పొరేషన్‌ చైర్మన్‌ సంఘ వెంకట్రాజం, ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ చిలువేరు శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కొరవి పరమేశ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్‌ బాష్‌మియా, రత్నమాల, సయ్యద్‌ ఫైజుల్లా, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ జిల్లా నాయకుడు హకీమ్‌ నవీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement