భూగర్భంలోనే కాకతీయుల కళాఖండాలు | - | Sakshi
Sakshi News home page

భూగర్భంలోనే కాకతీయుల కళాఖండాలు

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

భూగర్భంలోనే కాకతీయుల కళాఖండాలు

ఖిలా వరంగల్‌: చారిత్రాత్మక ప్రదేశం కాకతీయ రాజధానిలో అనేక అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు భూగర్భంలోనే దాగి ఉన్నాయని, ప్రజలు సహకరిస్తే వాటిని వెలికితీసి టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సత్యశారదను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్‌, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్‌ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కాకతీయుల కట్టడాలను పరిరక్షించాలని వారు కోరుతూ జ్ఞాపికతోపాటు వినతిపత్రం అందజేశారు. అనంతరం, కలెక్టర్‌ మాట్లాడుతూ ఉర్సు రంగలీల మైదానంలో జరగనున్న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను మైసూర్‌ ఉత్సవాలను తలదన్నేలా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెలిదేశి శివమూర్తి, రంజిత్‌, వెంకటేశ్వర్లు, అఖిల్‌గౌడ్‌, అజయ్‌, సంజీవ్‌, అశోక్‌, మహేష్‌, గోవర్ధన్‌, శ్రీను, సంతోష్‌, రాజు, రాజశేఖర్‌, రమేష్‌, మనోహర్‌ పాల్గొన్నారు.

ప్రజలు సహకరిస్తే చరిత్రను వెలికితీస్తాం

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement