న్యూస్‌రీల్
తెగబడిన కూటమి నేతలు
ఎంటీఎంసీ ఎన్నికల్లో బూత్‌లు ఆక్రమించుకున్న కూటమి నేతలు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దొంగ ఓట్లు వేయిస్తూ కొన్నిచోట్ల భౌతిక దాడులకు దిగుతూ బీభత్సం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని నూతక్కిలోని పలు పోలింగ్ బూత్‌లలో కొంతమంది విద్యార్థులతో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పటికే కొంతమంది బూత్‌ల్లోకి వెళ్లి ఓట్లు వేస్తుండగా అక్కడే ఉన్న ఏజెంట్లు ఎన్నికలు జరిగే ఆవరణలో ఉన్న అభ్యర్థులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను బయటకు పంపించే ప్రయత్నం చేయగా పోలింగ్ బూత్ ఆవరణలో వున్న టీడీపీ నాయకులకు, వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వైస్సార్ సీపీ అభ్యర్థులను బలవంతంగా బయటకు నెట్టివేశారు. టీడీపీ కార్యకర్తలు సైతం దాడిచేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. పోలీసులు వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై లాఠీలు విసిరారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చేటు చేసుకోవడంతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బయటకు పంపించారు.
ఇదే సమయంలో దొంగ ఓట్లు వేసేందుకు విజయవాడ నుంచి కొంతమందిని తీసుకువచ్చి పోలీసులే లోపలకు పంపిస్తుంటే వీడియో తీస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తపై రోడ్డుపై సీఐ వీరేంద్ర తనదైన శైలిలో విరుచుకుపడి అతడి వద్ద సెల్‌ఫోన్ లాక్కుని జీపులోకి ఎక్కించారు. ఇదే క్రమంలో కరకట్టపై వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యకర్తలు నిలబడి ఉండగా వైఎస్సార్ సీపీ వారిని టార్గెట్ చేసుకుని లాఠీచార్జి చేసి టీడీపీ, జనసేన నేతలపై సానుకూలంగా వ్యవహరించారు. కూటమి నేతలు బూత్‌ల్లోకి వెళ్లి వైఎస్సార్ సీపీ ఏజంట్లను బయటకు లాక్కొస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎంటీఎంసీ వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసింది. అయితే ఎటువంటి గొడవలు లేకపోయినా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జరుగుతున్న గొడవలను వీడియో తీస్తున్న సమయంలో కూటమి నాయకులు, పోలీసులు దౌర్జన్యంచేసి సెల్‌ఫోన్‌లు లాక్కున్నారు. వైఎస్సార్ సీపీ గెలుపునకు అనుకూలంగా ప్రతి ప్రాంతంలో టీడీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లను ప్రోత్సహించడంతో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులే టీడీపీ,
పోలీసుల టార్గెట్
రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు..
సహకరించిన ఖాకీలు
దొంగ ఓట్ల కోసం పాన్‌కార్డులు సిద్ధం
పలు బూత్‌లలో జోరుగా దొంగ ఓట్లు
దగ్గరుండి లోపలకు పంపిన పోలీసులు
ప్రశ్నించిన వారిపై లాఠీచార్జి
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు,
చీఫ్ ఏజెంట్లను బలవంతంగా
బయటకు పంపిన వైనం


